తలసానికి దేవేందర్ ఫోన్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో చేరుతున్న టి. దేవేందర్ గౌడ్ పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ ను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. తన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న శ్రీనివాస యాదవ్ కు దేవేందర్ గౌడ్ గురువారం ఉదయం ఫోన్ చేశారు. పార్టీని బలోపేతం చేయడానికే తాను వస్తున్నానని దేవేందర్ గౌడ్ తలసానితో చెప్పినట్లు తెలుస్తోంది.
అందరం కలిసి పార్టీని బలోపేతం చేద్దామని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మిద్దామని దేవేందర్ ఆయనకు చెప్పినట్లు సమాచారం. తలసాని శ్రీనివాస్ యాదవ్ కు దేవేందర్ ఫోన్ చేసినట్లు తలసాని అనుచరులు గురువారం ఉదయం చెప్పారు. అయితే తాను అటువంటి ఫోన్ ఏదీ చేయలేదని దేవేందర్ గౌడ్ మొదట చెప్పినట్లు వార్తలు వచ్చాయి. గురువారం మధ్యాహ్నం దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు.












Click it and Unblock the Notifications