బాబుకు ప్రసన్న మరో లేఖ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆ పార్టీ శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గురువారం మరో లేఖాస్త్రం సంధించారు. చంద్రబాబుపై, ఆయన కోటరీపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మరో శాసనసభ్యుడు బాలినాగిరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి జత కూడారా. తాను చంద్రబాబుకు రాసిన లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావనే అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మలేదని, అందుకే తెలుగుదేశం పార్టీని ఓడించారని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. చంద్రబాబు స్వర్గీయ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచారన ఆయన ఆరోపించారు. చంద్రబాబును ఆయన ఔరంగజేబుగా అభివర్ణించారు. చంద్రబాబు చేసిన నిర్వాకాలు చాలునని ఇక పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని ఆయన అన్నారు. తాము చంద్రబాబుతో మాట్లాడాలని అనుకున్నామని, అయితే చంద్రబాబు చుట్టూ ఉండే కోటరీ తనకు ఆ ఆవకాశం ఇవ్వలేదని, అందుకే బహిరంగ లేఖలు రాయాల్సి వస్తోందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు, ఆయన కోటరి సర్వనాశనం చేస్తున్నారని ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు.












Click it and Unblock the Notifications