ఓబుళాపురంపై దద్ధరిల్లిన సభ
హైదరాబాద్: ఓబుళాపురం గనుల లీజు వ్యవహారంపై గురువారం శాసనసభ దద్ధరిల్లింది. ఓబుళాపురం గనుల విషయంలో అనేక అక్రమాలు జరిగాయని తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆరోపించారు. ఓబుళాపురం గనుల లీజు వ్యవహారంపై విచారణకు సభా సంఘం వేయాలని తెలుగుదేశం సభ్యులు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం తోసిపుచ్చింది. దీంతో టిడిపి సభ్యులు ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకున్నారు. తమ డిమాండుకు అంగీకరించాల్సిందేనని తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టారు.
టిడిపి సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దాంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సభాధ్యక్ష స్థానలో కూర్చున్న ఉప సభాపతి నాదెండ్ల మనోహర్ తో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వాగ్వివాదానికి దిగారు. ఓబుళాగనుల లీజులో ప్రభుత్వం పక్ష పాత ధోరణి అవలంబిస్తోందని చంద్రబాబు విమర్శించారు. సభా కార్యక్రమాలు స్తంభించడంతో డిప్యూటీ స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications