హైదరాబాద్: హైదరాబాదులోని చర్లపల్లి జైలులో ఓ ఖైదీ శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఖలీల్ అక్బర్ అలీ అనే ఖైదీ నిద్ర మాత్రలు మింగి ఆత్యహత్య యత్నం చేశాడు. అతన్ని జైలు అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. రాఖీ కట్టడానికి అతని కుటుంబ సభ్యులు జైలుకు వచ్చారని, వారిని అధికారులు అనుమతించలేదని, దాంతో మనస్తాపానికి గురైన ఖలీల్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడని అంటున్నారు.