మీరు గొడవ చేయలేదా: కేశవ్

రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులపై, రైతులు పడుతున్న ఇబ్బందులపై తామ మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అనడం శోచనీయమని ఆయన అన్నారు. బడిపిల్లలు మధ్యాహ్న భోజనంతో సరిపెట్టుకుంటున్నారని, కళాశాల విద్యార్థులు చదువు మానేయాల్సి వస్తోందని ఆయన అన్నారు. కరువుతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. కరువు మండలాల ప్రకటనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను ఆయన వివరించారు. వివిధ సంఘటనలను ఆయన ఉదహరించారు.












Click it and Unblock the Notifications