కడప: కడపలో గురువారం స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. గోపాలకృష్ణ అనే వ్యక్తి స్వైన్ ఫ్లూ లక్షణాలతో రిమ్స్ ఆస్పత్రిలో చేరాడు. అతను వారం రోజుల క్రితం మలేసియా నుంచి కడప సమీపంలోని తన స్వగ్రామానికి వచ్చాడు. మలేసియాలోని ఓ సిమెంట్ కంపెనీలో పని చేస్తున్న అతను వారం రోజుల పాటు కుటుంబ సభ్యులతోనే ఉన్నాడు. అయితే, స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో ఆయన గురువారం రిమ్స్ ఆస్పత్రికి వచ్చాడు.
గోపాలకృష్ణ ఇద్దరు కుమారులను కూడా కడపకు రప్పిస్తున్నారు. కుటుంబంలోని నలుగురికి కూడా స్వైన్ ఫ్లూ సోకిందని అనుమానిస్తున్నారు. దీంతో వారిని పరీక్షించడానికి హైదరాబాదు నుంచి నిపుణులను రప్పిస్తున్నారు.