గన్ పార్కు వద్ద టిడిపి ధర్నా

శాసనసభలో కరపుపై చర్చను అడ్డుకోవడానికి తమ పార్టీ శాసనసభ్యులను తిట్టి వారిని సస్పెండ్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో మంచినీరు, సాగునీరు, పశుగ్రాసం కొరత వల్ల రైతులు తీవ్ర ఇక్కట్ల పాలై రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. కరువు పరిస్థితులపై నివేదిక పంపాలని ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారని, అయితే ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం స్పందించలేదని,త ఇది ప్రభుత్వ నిర్లిప్తతకు తార్కాణమని తెలుగుదేశం శాసనసభ్యుడు రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications