కరీంనగర్: పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురి కావడంతో మంగళవారం ఉదయం 9 మంది దుర్మరణం పాలయ్యారు. 13 మందితో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న జీపు కరీంనగర్ జిల్లా కమాన్ పూర్ మండలం కల్వచర్ల వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో 8 మంది అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలున్నారు. గాయపడిన నలుగురిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సుల్తానాబాద్ నుంచి స్వగ్రామం మహదేవ్ పూర్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.