బిజెపి నేతలకు జస్వంత్ దూరం

Jaswant Singh
సిమ్లా: సిమ్లాలో పార్టీ చింతన్ బైఠక్ లో పాల్గొనడానికి వచ్చిన బిజెపి నేత జస్వంత్ సింగ్ పార్టీ ఇతర నాయకులకు దూరంగా ఉంటున్నారు. పార్టీ మూడు రోజుల చింతన్ బైఠక్ బుధవారం ప్రారంభమైంది. పార్టీ నాయకులకు దూరంగా విడిగా హోటల్లో ఉంటున్నారు. పార్టీ అగ్రనేత ఎల్ కె అద్వానీ ఇచ్చిన రాత్రి విందుకు కూడా హాజరు కాలేదు.

తన పుస్తకంలో మొహమ్మద్ అలీ జిన్నాను జస్వంత్ ప్రశంసించారు. ఆయన రాసిన జిన్నా - ఇండియా, పార్టీషన్, ఇండిపెండెన్స్ పుస్తకంపై బిజెపి నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఆయన మంగళవారం రాత్రే ఇక్కడికి చేరుకున్నారు. ఎల్ కె అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ లతో పాటు పార్టీ నేతలంతా ప్రభుత్వ అతిథి గృహంలో బస చేయగా జస్వంత్ సింగ్ మాత్రం ఒబెరాయ్ గ్రూపునకు చెందిన హోటల్ సెసిల్ లో బస చేశారు.

ప్రభుత్వ అతిథి గృహంలో జస్వంత్ సింగ్ కు ఏర్పాట్లు చేశామని, ఆయన బయట ఉంటున్నట్లు తమకు చివరి నిమిషంలో తెలిసిందని పార్టీ సీనియర్ నాయకుడొకరు అన్నారు. జస్వంత్ సింగ్ తన గదికే పరిమితమయ్యారు. లోకసభ ఎన్నికల్లో ఓటమిపై, వచ్చే హర్యానా ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహంపై పార్టీ సమావేశం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+