కాంగ్రెసులో చిరు పార్టీ విలీనం?

బుధవారం రాత్రి జరిగిన సమావేశానికి భూమా దంపతులు శోభానాగిరెడ్డి, భూమా నాగిరెడ్డితో పాటు వేదవ్యాస్ కూడా పాల్గొన్నట్లు వార్త వచ్చింది. అవంతి శ్రీనివాస్, శ్రీధర కృష్ణారెడ్డి, అన్నె రాంబాబు, శ్రీనివాస్, సిహెచ్ వెంకటరావు పాల్గొన్నట్లు వార్త వచ్చింది. సమావేశానికి హాజరు కాలేకపోయినవారు ఫోన్ లో తమ అభిప్రాయాలను అల్లు అరవింద్ కు వినిపించినట్లు వార్తా కథనం, ప్రస్తుత పరిస్థితిలో పార్టీని ఇలాగే కొనసాగించడానికి బదులు కాంగ్రెసు పార్టీలో విలీనం చేయడమో, ఆ పార్టీతో అవగాహన కుదుర్చుకోవడమో చేయాలని ఎక్కువ మంది అభిప్రాయపడినట్లు ఆ పత్రిక రాసింది. పార్టీ శాసనసభ్యులు ఒక్కరొక్కరే పార్టీని వీడి కాంగ్రెసులో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తాకథనం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీకి భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో పార్టీ శాసనసభ్యులు ఆ ప్రతిపాదనను అల్లు అరవింద్ ముందుంచినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications