చిరు పార్టీకి వైయస్ ఎసరు

శోభానాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డి వంటి ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు కాంగ్రెసు పార్టీలో చేరుతారనే వార్తాకథనాలు వస్తున్న నేపథ్యంలోనే ఈ వార్తాకథనం ప్రచురితమైంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డిని వైయస్ తన వైపు తిప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులకు కూడా ఆయన వల వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది శాసనసభ్యులు ముఖ్యమంత్రిని కలిసి కాంగ్రెసులోకి వస్తామని చెప్పినట్లు, సమయం వచ్చినప్పుడు చూద్దాం అక్కడే ఉండండని ముఖ్యమంత్రి వారికి చెప్పినట్లు గతంలో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయనకు ప్రజారాజ్యం పార్టీని ఏకమొత్తంగా పార్టీ వైపు తిప్పుకునే సమయం వచ్చినట్లు బహుశా భావిస్తూ ఉండవచ్చు.












Click it and Unblock the Notifications