న్యూఢిల్లీ: మిస్ యూనివర్స్ 2009 పోటీల్లో మిస్ ఇండియా ఏక్తా చౌదరి విఫలమైంది. ఆమె టాప్ 15 స్థానాల్లో కూడా స్థానం సంపాదించుకోలేకపోయింది. విశ్వసుందరి పోటీలు సోమవారం ఉదయం జరిగాయి. మిస్ యుఎస్ ఎ మొదటి 15 స్థానాల్లో చోటు దక్కించుకుంది.
పూర్తే రికో, ఐస్ లాండ్, అల్పానియా, చెక్ రిపబ్లిక్, బెల్జియం, డెమొనికన్ రిపబ్లిక్, స్వీడన్, కొసోవో, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికా, క్రోషియా, వెనిజులా సుందరులు మిస్ యూనివర్శ్ పోటీలకు అర్హత సాధించారు.