బిజెపి సారథి రేసులో జైట్లీ

గురువారం సాయంత్రం అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, వెంకనయ్యనాయుడు, అనంతకుమార్ భగవత్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భగవత్ వారికి కరాఖండిగా విషయాన్ని తేల్చి చెప్పినట్లు సమాచారం. జైట్లీ, స్వరాజ్ లను కలిపి సమావేశం ఏర్పాటు చేయడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ నాయకత్వం కోసం ఈ ఇద్దరు పోటీ పడుతున్నట్లు సమాచారం. సుష్మా స్వరాజ్ ఎల్ కె అద్వానీ స్థానంలో ప్రతిపక్ష నేత పదవిని చేపట్టాలని, జైట్లీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఇది ఇంకా తుది రూపు దాల్చలేదని అంటున్నారు. కానీ మార్పులకు మాత్రం ప్రాతిపదిక తయారైనట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications