రాష్ట్రంలో వైయస్ జగన్ మానియా

వైయస్ సంతాపదినాలు ముగిసేంత వరకు కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ఆలోచన చేయబోమని కాంగ్రెసు అధిష్ఠానవర్గం స్పష్టం చేసింది. ఏడు రోజుల పాటు సిఎల్పీ సమావేశం జరగదనే విషయం దాని ద్వారా వెల్లడైంది. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే ఆందోళనలకు సంబంధించిన ఉద్వేగాలు తగ్గే వరకు నిరీక్షించాలనేది పార్టీ అధిష్ఠాన వర్గం ఆలోచనగా తెలుస్తోంది. జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోతే రాజీనామా చేస్తామని కొందరు యువ శాసనసభ్యులు హెచ్చరికలు బహిరంగంగానే చేశారు. మెదక్ జిల్లాలో కొంతమంది సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేశారు. శాసనసభ్యులు సిహెచ్ లింగయ్య, టి. రాజయ్య నిరాహార దీక్షకు దిగారు. వరంగల్, మెదక్, గుంటూరు, తదితర ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications