మేడమ్ నిర్ణయిస్తారు: కెవిపి

సోనియా గాంధీని కలవడానికి ముందు ఆయన మేడమ్ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు శిరోధార్యమని ఆయన అన్నారు. రోశయ్యనే మరి కొంత కాలం ముఖ్యమంత్రిగా కొనసాగించే అవకాశం ఉందని వస్తున్న వార్తలపై ప్రశ్నించగా ఆయన రెండు చేతులూ జోడించి మేడమ్ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని అన్నారు. పిసిసి సంతాప సభలో జరిగిన గొడవపై ఆయన సోనియా గాంధీకి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కెవిపి సోనియా గాంధీని కలిసినప్పుడు ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కూడా ఉన్నారు. మరి కొంత కాలం ఢిల్లీలోనే ఉండాలని పార్టీ అధిష్ఠాన వర్గం కెవిపికి సూచించినట్లు సమాచారం. ఆయన మరోసారి సోనియా గాంధీని కలిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications