సిఎం పోస్టుపై శనివారం భేటీ

కోర్ కమిటీ అభిప్రాయాన్నే కాకుండా మరి కొంత మంది అగ్ర నేతల అభిప్రాయం కూడా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలనేది సోనియా గాంధీ అభిమతంగా తెలుస్తోంది. కేంద్రంలో కాంగ్రెసు అధికారానికి రావడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని ఎంపిక చేయడంలో పార్టీ అధిష్ఠాన వర్గం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. వైయస్ జగన్ అనుభవంపైనే కాకుండా వైయస్ రాజశేఖర రెడ్డి అంత్యక్రియలు జరగకుండానే ఆయన లాబీ వైయస్ జగన్ కోసం పట్టుబట్టడంపై కూడా అధిష్ఠానవర్గం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అయితే, ఇప్పటికే జగన్ కు అనుకూల, ప్రతికూల వర్గాలు ఢిల్లీలో మోహరించాయి. జగన్ కు మెజారిటీ శాసనసభ్యుల మద్దతు ఉన్నప్పటికీ వ్యతిరేకులు పెద్దగా బయట పడకపోయినప్పటికీ పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంపై కూడా అధిష్ఠాన వర్గం ఆలోచిస్తోంది. బొటాబోటీ మెజారిటీతోనే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తే జరిగే తిరుగుబాట్లపై కూడా దృష్టి పెట్టింది.












Click it and Unblock the Notifications