ఒరిస్సాలో మావోయిస్టుల విధ్వంసం

మావోయస్టులు బిమల్ గర్, పతంగిల మధ్య నక్సలైట్లు ఏడు చోట్ల రైల్వే ట్రాక్ ను పేల్చివేశారు. కాల్తాలో ఖాళీగా ఉన్న పోలీసు స్టేషన్ ను పేల్చివేశారు. గతంలో సిఆర్పీఎఫ్ క్యాంపు ఉన్న భవంతిని, కమ్యూనిటీ సెంటర్, సిఐటియు కార్యాలయ భవంతులను కూడా వారు పేల్చివేశారు. ఒక ట్రక్ ను కూడా దగ్దం చేసినట్లు పోలీసులు తెలిపారు. పేలుళ్ల వల్ల రూర్కెలా, బర్సౌనాల మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మావోయిస్టుల దాడుల్లో ఏ విధమైన ప్రాణ నష్టం సంభవించలేదు. పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాలకు చేరుకున్నారు. జిల్లాలో గస్తీని ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications