జగన్ పై నిర్ణయం వాయిదా

YS Jagan
న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై వైయస్ జగన్ ను కూర్చోబెట్టాలా, వద్దా అనే అంశంపై ఎఐసిసి కోర్ కమిటీ తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. గురువారం సాయంత్రం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటారని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే ఏ నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింగి. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాసంలో గంటకు పైగా జరిగిన సమావేశంలో రాష్ట్రంలో నాయకత్వ మార్పిడిపై చర్చ జరిగిందని, అయితే ఏ నిర్ణయమూ తీసుకోలేదని సమాచారం. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ పాల్గొనలేదు.

కోర్ కమిటీ సమావేశం ముగిసిన వెంటనే కెవిపి రామచందర్ రావు కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అహ్మద్ పటేల్ ను, ప్రణబ్ ముఖర్జీని వేర్వేరుగా కలుసుకున్నారు. అయితే వారు కెవిపి రామచందర్ రావు అసలు విషయం చెప్పినట్లు సమాచారం. తాను వైయస్ సంతాప సభలో పాల్గొనేందుకు శుక్రవారం హైదరాబాద్ వెళ్తున్నానని కెవిపి వారితో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే శనివారం అందుబాటులో ఉండాలని వారు కెవిపికి సూచించినట్లు సమాచారం. జాతీయ పత్రికల్లో జగన్ కు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయి. దీంతో కెవిపి జాతీయ మీడియా ప్రతినిధులను పిలిపించుకుని మాట్లాడారు.

కాగా, కాంగ్రెసు నేత కె.కేశవరావు, మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అహ్మద్ పటేల్ ను కలుసుకున్నారు. ఇది అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయం తీసుకుంటుందని కేశవరావు మీడియా ప్రతినిధులతో చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+