జగన్ కాకపోతే రాజీనామా: మంత్రి

YS Jagan
హైదరబాద్: వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయకపోతే రాజీనామా చేస్తానని గతంలో చేసిన ప్రకటనకు తాను కట్టుబడి ఉన్నానని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి రామచంద్రారెడ్డి అన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి లేని లోటును ఆయన కుమారుడు జగన్ పూరిస్తారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రమంతా కోరుకుంటోందని ఆయన అన్నారు.

జగన్ ను ముఖ్యమంత్రిని చేయడం మినహా ప్రత్యామ్నాయం లేదని మరో మంత్రి మాణిక్యవర ప్రసాద్ అన్నారు. తనను గెలిపించిన ఘనత వైయస్ జగన్ దేనని, జగన్ ప్రచారం చేయడం వల్లనే తాను గెలిచానని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి ఎవరవుతారనే విషయంలో అయోమయం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు అధిష్టాన వర్గం తనదైన శైలిలో అందరి అభిప్రాయాలను తెలుసుకుంటున్నందననే జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు. రాజీ ఫార్ములా కేవలం మీడియా సృష్టేనని ఆయన అన్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ కు అందరి మద్దతు ఉందని ఆయన చెప్పారు. ప్రజాభిప్రాయానికి పార్టీ అధిష్ఠానవర్గం ఆమోదం తెలుపుతుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+