కెవిపి ఇంట్లో మంత్రుల భేటీ

జగన్ తో సమావేశం ముగిసిన తర్వాత కెవిపి తన నివాసంలో మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు సుదర్శన్ రెడ్డి, ముఖేష్ గౌడ్, కన్నా లక్ష్మినారాయణ, గాదె వెంకటరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి హాజరైనట్లు సమాచారం. మంత్రులు చాలా మంది జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఈ చర్చలు బుధవారం కూడా కొనసాగుతాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications