జగన్ పై మంత్రులు తలో మాట

ఢిల్లీలో పార్టీ అధిష్ఠాన వర్గంతో జరిపిన చర్చల వివరాలు తెలుసుకోవడానికి తాము కెవిపి నివాసానికి వచ్చినట్లు మంత్రి డికె అరుణ చెప్పారు. రాష్ట్ర ప్రజల, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు పార్టీ అధిష్ఠానవర్గానికి తెలుసునని ఆమె అన్నారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని తాము నమ్ముతున్నట్లు ఆమె తెలిపారు. అంతా సవ్యంగా జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు ఆమె తెలిపారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేసే విషయంలో పార్టీ అధిష్ఠాన వర్గం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని మంత్రి గల్లా అరుణ అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేసే విషయంలో ఢిల్లీ వివరాలు కెవిపి తమకు చెప్పారని ఆమె అన్నారు. పార్టీ అధిష్ఠాన వర్గం జగన్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే ఏం చేయాలనే విషయంపై అప్పుడే నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications