కాంగ్రెస్ పిలుపు: ఢిల్లీకి నేదురమల్లి

వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని నేదురమల్లి జనార్దన్ రెడ్డి కూడా అభిప్రాయపడ్డారు. ఆయన జగన్ కు మద్దతు వ్యక్తం చేశారు. నేదురమల్లి జనార్దన్ రెడ్డి సతీమణి రాజ్యలక్ష్మి మొదటి విడత వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మంత్రిగా పని చేశారు. 2009 ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. నిజానికి, నేదురమల్లి జనార్దన్ రెడ్డి వైయస్ వ్యతిరేకులే అయినప్పటికీ ప్రస్తుతం జగన్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు.












Click it and Unblock the Notifications