సిఎంలను మార్చరు: రోశయ్య

తాను బలహీనుడ్ని, తన పరిపాలన బలహీనం కాదని ఆయన స్పష్టం చేశారు. తన బలమేమిటో తనకు ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన కెవిపి రామచందర్ రావు గురించి తాను ఇది వరకే చెప్పానని ఆయన అన్నారు. మళ్లీ చెప్పడానికేమీ లేదని ఆయన అన్నారు. కెవిపి రాజ్యసభ సభ్యుడు అని, పార్టీలో కీలక నేత అని, కెవిపికి ఉన్న ప్రాముఖ్యం, గౌరవం కెవిపికి ఉన్నాయని ఆయన అన్నారు. కష్టమైనా, క్లిష్టమైనా వైయస్ రాజశేఖర రెడ్డి కార్యక్రమాలను ముందు తీసుకుని వెళ్తామని ఆయన అన్నారు. వైయస్ రాష్ట్రంలో, పార్టీలో ఓ వెలితి ఏర్పడిందని ఆయన అన్నారు. దీన్ని అధిగమించాల్సి ఉందని ఆయన అన్నారు.
వైయస్ జగన్ సేవలను తప్పకుండా ఉపయోగించుకుంటామని ఆయన చెప్పారు. జగన్ ఉత్సాహవంతుడు, యువకుడు, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నవాడు, ఆయన సేవలు ఎలా ఉపయోగించుకోవాలో అధిష్ఠానం చూసుకుంటుందని రోశయ్య అన్నారు. తాను ప్రకటనలు ఇవ్వకుండగా అవసరం వచ్చినప్పుడు అధిష్ఠానానికే వివరిస్తానని ఆయన చెప్పారు. డిజిపి, ప్రధాన కార్యదర్శుల మార్పు ఇప్పట్లో ఉండదని ఆయన స్పష్టం చేశారు. వైయస్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకంపై అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా ఆసక్తి చూపుతున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications