ఇదేం సోది: శోభా నాగిరెడ్డి

తాను కాంగ్రెసు పార్టీ సభకు వెళ్లలేదని, నాయకుడి సంస్మరణకు వెళ్లానని, ఇంత చిన్న విషయంపై రాద్ధాంతం చేయడం తగదని ఆమె అన్నారు. తాను అందరిలాగే రాజశేఖర రెడ్డి మృతికి నివాళులర్పించానని, ఇందులో రాజకీయమేదీ లేదని ఆమె అన్నారు. తమ పార్టీ నేత చిరంజీవి మంచితనాన్ని కొందరు వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. పార్టీకి అతీతంగా వెళ్లామని, వైయస్ కుటుంబానికి తమకు కుటుంబానికి వ్యక్తిగత సంబంధాల వల్లనే వెళ్లామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications