పాకిస్తాన్ లో దాడులు: 16 మంది మృతి

అంతకు ముందు బన్ను జిల్లాలోని పోలీసు స్టేషన్ లోకి కారు బాంబు దూసుకెళ్లి పేలిపోయింది. దీంతో ఆరుగురు మరణించగా, 70 మంది దాకా గాయపడ్డారు. ఈ సంఘటన బన్ను జిల్లాలోని పోలీసు స్టేషనులో జరిగింది. పోలీసు స్టేషన్ భవనం కూలడంతో శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. మృతుల్లో ఒక పోలీసు అధికారి, ఒక ఖైదీ ఉన్నట్లు భావిస్తున్నారు.
ప్రభుత్వ తీరును తాము నిరసిస్తున్నామని, పాకిస్తాన్ దాడులను ఆపాల్సిన అవసరాన్ని గుర్తించడం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే ఆత్మాహుతి దాడులు పెరుగుతాయని తాలిబన్ అధికార ప్రతినిధి ఖారీ హుస్సేన్ మెహసూద్ అసోసియేటెడ్ ప్రెస్ కు ఫోన్ చేసి చెప్పాడు.












Click it and Unblock the Notifications