హైదరాబాదు : ఖమ్మం డీసీసీ కార్యాలయంలో సోనియా పోస్టర్లు చించిన సంఘటపై విచారణ జరుగుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ దుశ్చర్యపై పార్టీ సీనియర్లతో పాటు అందరూ బాధపడుతున్నారని ఆయన తెలిపారు. ఇది బయటి వ్యక్తుల పనే అయుంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారని చీఫ్ విప్ తెలిపారు.