హైదరాబాద్: ముఖ్యమంత్రి రోశయ్యను మాజీమంత్రి జేసీ దివాకర్‌రెడ్డి గురువారం ఆయన నివాసంలో కలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను మర్యాదపూర్వకంగానే సీఎంను కలిశానన్నారు. తమ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని చెప్పారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై తనకు ఎలాంటి సమాచారం లేదని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ఇందుకు సంబంధించి వార్తలను తాను కూడా మీడియాలోనే వింటున్నానని జేసీ అన్నారు.