విజయవాడ: దసరా ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మకు 85 లక్షల పైచిలకు ఆదాయం వచ్చింది. ఈ నవరాత్రులలో భక్తులు అమ్మ వారికి సమర్పించిన కానుకలను ఆలయ అధికారులు లెక్కించారు. ఆలయ పరిధిలోని 13హుండీలను లెక్కించగా నగదు రూపంలో రూ.85,46,128లు, ఆభరణాల రూపంలో 282 గ్రాములు, వెండి 4.505 కేజీలు, 50 యూఎస్ డాలర్లు ఆదాయంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన హుండీలను కూడా ఈ వారంలో లెక్కించనున్నట్లు ఆలయ ఈఓ గోపాలకృష్ణారెడ్డి చెప్పారు.