వరద బాధితులను ఆదుకోండి: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: రాష్ట్రంలోని వరద బాధితులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వరద బాధితుల కోసం స్వచ్ఛందంగా సహాయం అందించాలని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో సూచించారు. వరద బాధితులకు సంబంధించిన సమాచారాన్ని కంట్రోల్ రూంలకు చేరవేయాలని, దాని వల్ల అధికారులు సహాయక చర్యలు చేపట్టడానికి వీలవుతుందని, ఈ సమాచారాన్ని తమకు కూడా పంపితే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడానికి వీలవుతుందని ఆయన చెప్పారు. వరద తాకిడి ప్రాంతాల్లోని ప్రజలను సురక్షితంగా ప్రాంతాలకు తరలించి, వారికి అవసరమైన భోజన సౌకర్యం కల్పించడానికి పని చేయాలని ఆయన కార్యకర్తలను కోరారు.

మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు వరద బాధితుల సహాయం కోసం అందుబాటులో ఉండడం అవసరమని, అలా లేకపోవడం ద్రోహమే అవుతుందని ఆయన అన్నారు. ఇంత భారీ వరదలు రాష్ట్రంలో మునుపెన్నడూ రాలేదని ఆయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా వరద బాధితులను ఆదుకోవాలని ఆయన సూచించారు. వరద బాధితుల విషయమై ఆయన శుక్రవారం ఉదంయ ముఖ్యమంత్రి కె. రోశయ్యతో ఫోనులో మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+