కర్నూలు బాధితుల హాహాకారాలు

Kurnool
కర్నూలు: కర్నూలు పట్టణం, కర్నూలు జిల్లాకు వరద ముప్పు నుంచి కోలుకుంటున్నప్పటికీ బాధితులు సాయం కోసం అర్రులు చాస్తూనే ఉన్నారు. మరో రెండు మూడు రోజుల వరకు సాధారణ పరిస్థితులు నెలకొనే పరిస్థితి లేదు. కర్నూలు పాత నగరం మురికి కూపంగా మారింది. దాదాపు లక్ష మంది ఈ ప్రాంతంలో నివసిస్తారు. రోటరీ, లయన్స్ క్లబ్ వంటి సంస్థలు ఆహారం పొట్లాలు అందిస్తున్నప్పటికీ అవి సరిపోవడం లేదు. తుంగభద్ర నదిలో వరద ఉధృతి చాలా వరకు తగ్గింది. తిరిగి కర్నూలు జిల్లాకు వరద ముప్పు లేదు. కానీ ప్రజలు సాధారణ జీవనం గడపలేని పరిస్థితి నెలకొని ఉంది.

కర్నూలు జిల్లాలోని కృష్ణా నది ప్రవాహానికి విలవిలలాడిన బండి ఆత్మకూరు, నందికొట్కూరు తదితర మండలాల్లో 40 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. ఐడు గ్రామాల ప్రజల ఇతర ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. ఏడు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందిస్తున్నప్పటికీ అవి సరిపోవడం లేదు. తుంగభద్ర వరద తాకిడికి 34 మండలాలు గురయ్యాయి. బాధితులు దాదాపు ఐదున్నర లక్షల మంది ఉంటారు. లక్షన్నర మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. కెసి కెనాల్, తుంగభద్రలకు మధ్య ఉన్న ప్రాంతాల్లో పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఐదున్నర లక్షల ఎకరాల పంట మాత్రమే నష్టమైందని చెబుతున్నప్పటికీ నష్టం రెట్టింపు ఎకరాల్లో ఉంటుందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+