కె చంద్రశేఖర రావు ఎడమ కంటికి శస్త్రచికిత్స

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కె.చంద్రశేఖర రావు ఎడమ కంటికి సోమవారం శస్త్రచికిత్స జరిగింది. సెంటర్ ఫర్ సైట్ ఆస్పత్రిలో ఆయన తన ఎడమ కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్ విజయవంతమైందని తెరాస నాయకుడు వినోద్ కుమార్ చెప్పారు. ఆయనకు మూడు రోజుల విశ్రాంతి అవసరం. ఆ తర్వాత ఆయన మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వెళ్తారు.

ఇదిలా ఉంటే, మహబూబ్ నగర్ జిల్లా వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు రంగంలోకి దిగారు. వరద బాధితులకు తెరాస నాయకులు 20 లక్షల రూపాయల విలువ చేసే ఆహార పదార్థాలు, దుప్పట్లు, మొదలైనవాటిని పంపారు. జిల్లాలో వరద తాకిడికి గురైన 9 మండలాలకు పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు 8 వ్యాన్లలో సామగ్రిని తరలించారు. మహబూబ్ నగర్ జిల్లా వరద బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని పార్టీ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+