రోశయ్య పాలన భళే: జానా రెడ్డి

వరద సహాయ చర్యల్లో భాగంగా రోశయ్యకు సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జానా రెడ్డి అన్నారు. డిజిపి బదిలీ పరిపాలనలో ఓ భాగం మాత్రమేనని ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు జానారెడ్డి సమాధానమిచ్చారు. వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే మంత్రివర్గ విస్తరణపై మాట్లాడటం సరి కాదని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు.
ముఖ్యమంత్రి రోశయ్య మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణకు శ్రీకారం చుట్టబోతున్నట్లు, జానారెడ్డి వంటి సీనియర్లకు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రోశయ్యతో జానా రెడ్డి భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications