ఆయన బుద్ధి మందం: సురేఖ

Konda Surekha
వరంగల్: రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ అక్రమమే అయితే తెలంగాణాలో నిర్మిస్తున్నవి కూడా అక్రమమేనా? అని మంత్రి కొండా సురేఖ వరంగల్‌ జిల్లా పరకాలలో ప్రశ్నించారు. కంటి ఆపరేషన్‌తో కెసీఆర్ కు చూపుతోపాటు బుద్ధి కూడా మందగించిందని విమర్శించారు. ప్రజలు వరదలతో దుఃఖ సాగరంలో ఉంటే ఆయన అనవసర రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలను మరింత విషాదంలోకి నెడుతున్నారని అన్నారు.

"నల్ల కళ్లద్దాలు పెట్టుకుని ఢిల్లీలో ఉండి కాదు. ప్రజల్లోకి వచ్చి మాట్లాడండి" అని ఆమె కెసీఆర్ కు సవాల్‌ విసిరారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. ఉద్యమాన్ని సక్రమంగా నడిపించలేని కెసీఆర్ ప్రజల హృదయాల్లో దేవుడిగా నిలిచిన వైఎస్‌ను విమర్శించటం సరి కాదన్నారు. శ్రీశైలం సమీపంలో తుంగభద్ర, హంద్రీ కలుసుకోవటం వల్లనే కర్నూలు నీట మునిగిందని ఆమె చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+