ప్రధాని తప్పించుకుంటున్నారు: బాబు

ముఖ్యమంత్రి కె.రోశయ్య మంత్రులను నియంత్రించాలని, వరద తాకిడి ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించాలని ఆయన అన్నారు. తాము మాట్లాడితే రాజకీయాలు చేస్తున్నట్లు మంత్రులు విమర్శిస్తున్నారని, ముందు వారు రాజకీయాలు మాని వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని, తాము ఇప్పటికే చాలా సంయమనం పాటించాం, పాటిస్తామని ఆయన అన్నారు. మంత్రులు ప్రకటనలకే పరిమితవుతున్నారని, వరద తాకిడి ప్రాంతాలకు వెళ్లడం లేదని, పూర్తి బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. రేపల్లె వద్ద గండి పడుతుందని ముందే తెలిసినా మంత్రులు అక్కడికి షికారుకు వెళ్లినట్లు వెళ్లారని ఆయన వ్యాఖ్యానించారు.
వరద తాకిడి ప్రాంతాల్లో ప్రభుత్వం యంత్రాంగం పని చేయడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో చేపట్టింది జలయజ్ఞం కాదు, ధన యజ్ఞమని తాము ఆనాడే చెప్పామని ఆయన గుర్తు చేశారు. వరద సహాయక చర్యల విషయంలో బాధ్యతలు నిర్వర్తించడానికి ఇష్టం లేకపోతే మంత్రులు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు కష్టాల్లో ఉంటే మంత్రులు పని చేయకుండా కాలం వెళ్లదీస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications