వైయస్ జగన్మోహన్ రెడ్డికి హైకమాండ్ పిలువు?

YS Jaganmohan Reddy
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు కాంగ్రెసు పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు హైదరాబాదులో ప్రచారం జరుగుతోంది. జగన్ సోమవారం ఉదయం బెంగుళూర్ నుంచి హైదరాబాద్ వచ్చారు. ఆయన వచ్చిన వెంటనే దక్కన్ క్రానికల్ చైర్మన్ వెంకట్రామిరెడ్డిని పరామర్శించారు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. మంత్రి విశ్వరూప్, మంత్రులు, శాసనభ్యులు కొంతమంది ఆయనను కలుసుకున్నారు.

ఈ నెల 21, 22, 23 తేదీల్లో అందుబాటులో ఉండాలని పార్టీ అధిష్టానం జగన్ కు కబురు పంపినట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం పరిశీలించే అవకాశాలున్నట్లు తొలుత భావించారు. ఈ నెల 22వ తేదీననే మహారాష్ట్రతో పాటు మూడు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. రాష్ట్రంలో జగన్ వ్యవహారం పార్టీకి నష్టం కలిగించే అవకాశాలున్న నేపథ్యంలో పరిష్కారానికి కాంగ్రెసు హైకమాండ్ తొందరపడుతున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+