రోశయ్యకు దారి: జగన్ దే బాధ్యత

YS Jaganmohan Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రభుత్వం సజావుగా సాగడానికి మార్గం సుగమం చేయాల్సిన బాధ్యతను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వైయస్ జగన్ మీదనే పెట్టింది. జగన్ వర్గానికి చెందిన వారు ఎవరూ రోశయ్యపై తిరగబడకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఆయన మీదనే ఉంది. ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా రోశయ్య కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) నేతగా ఎంపికయ్యేందుకు సోనియా గురువారం వైయస్ జగన్ తో భేటీ ద్వారా మార్గం వేశారు. జగన్ వర్గానికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు పూర్తిగా రోశయ్యకు సహకరించాలని ఆమె ఆదేశించినట్లు తెలుస్తోంది.

జగన్ దాదాపు 20 నిమిషాల పాటు సోనియా గాంధీతో మాట్లాడినట్లు తెలుస్తోంది. రోశయ్యకు సహకరించడం మినహా మార్గం లేదని ఆమె చెప్పినట్లు సమాచారం. అందుకు జగన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో సోనియా నిర్ణయం శిరోధార్యమని జగన్ ప్రకటించారని అంటున్నారు. అయితే జగన్ కు కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఇవ్వడానికి ఆమె సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. కానీ జగన్ అందుకు సిద్ధంగా లేరని అంటున్నారు. రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెట్టిన ఏనాటికైనా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలనేదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+