రోశయ్యకు జగన్ బాబాయ్ కితాబు

ముఖ్యమంత్రి రోశయ్య పాలనా దక్షత గల వ్యక్తి అని, రోశయ్య పాలన గురుంచి మాట్లాడాల్సిందేమీ లేదని ఆయన అన్నారు. కడప జిల్లా పులివెందుల శాసనసభా నియోజకవర్గం అభ్యర్థిపై తాను, జగన్ చర్చించుకున్న తర్వాత అభ్యర్థి పేరును పార్టీ అధిష్టానానికి పంపుతామని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో పులివెందుల శాసనసభా నియోజక వర్గం ఖాళీ అయింది.
పులివెందుల నుంచి వైయస్ జగన్ శాసనసభకు పోటీ చేయవచ్చుననే ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ అధిష్టానం మాత్రం వైయస్ రాజశేఖర రెడ్డి భార్య విజయలక్ష్మిని గానీ, ఆయన కూతురు షర్మిళను గానీ పోటీకి దించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications