మాకొద్దీ మా తెలుగు తల్లి పాట: తెరాస

తెలంగాణ వనరులను, ఉపాధి అవకాశాలను కొల్లగొట్టడానికి పనికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం నవంబర్ 1వ తేదీని విద్రోహ దినంగా పాటించాలని తెరాస పిలువునిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ప్రకటించిన తీరు అప్రజాస్వామికమని కెసిఆర్ మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ఇప్పుడే వద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పినా ప్రకటించారని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తాము పాల్గొంటామా, లేదా అనే విషయంపై సోమవారం జరిగే పార్టీ కార్యవర్గ సమావేశంలో నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పాల్గొనరాదనేది పోలిట్ బ్యూరోలోని మెజారిటీ సభ్యుల అభిఫ్రాయమని ఆనయ చెప్పారు.












Click it and Unblock the Notifications