హైదరాబాద్: ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ప్రీజోన్ విషయంపై కేసీఆర్ మాట్లాడుతున్నారని అయితే ఆ జడ్జిమెంట్‌ను తెలంగాణ వాసులే తెచ్చారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పదవీత్యాగం చేసిన బూర్గుల రామకృష్ణారావు విగ్రహానికి ఎన్.ఎస్.యూ.ఐ ఆధ్వర్యంలో ఎంపీ లగడపాటి, ఎమ్మెల్యే శంకరరావు పూలమాలవేసి నివాళులర్పించారు. తెలంగాణ వారే ప్రీజోన్ జడ్జిమెంట్ తెచ్చారని వారు తీసుకురాలేదని కేసీఆర్ నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని లగడపాటి కేసీఆర్‌కు సవాల్ చేశారు.