వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వందే మాతరంపై ముస్లిం సంస్థ ఫత్వా

By Pratap
|
Google Oneindia TeluguNews

Vande Mataram
న్యూఢిల్లీ: జాతీయ గీతం వందే మాతర గీతాలాపనపై జమైత్ - ఎ - ఉలేమా హింద్ (జెయియు) ఫత్వా జారీ చేసింది. ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉద్దేశించినందున ఆ గీతాన్నీ ఆలపించవద్దని ముస్లింలకు సూచిస్తూ ఆ సంస్థ ఒక తీర్మానం చేసింది. దియోబాండ్ జాతీయ సదస్సులో ముస్లిం సంస్థ ఆ తీర్మానం చేసింది.

దేశభక్తి గీతమైన వందేమాతరం గీతంలోని కొన్ని ఫంక్తులు ఇస్లాం నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని, అందువల్ల ఆ పాటను ముస్లింలు వాడకూడదని ఆ తీర్మానంలో చెప్పారు. ఈ సదస్సులో కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం కూడా ప్రసంగించారు. తాము దేశాన్ని ప్రేమిస్తామని, అయితే గేయాన్ని ఆలపించబోమని ఈ సదస్సులో ముస్లిం లా బోర్డు నాయకుడు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X