హైదరాబాద్: కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవడానికి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి సిగ్గు లేదా అని రాజశేఖర్, జీవిత దంపతులు ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెసుతో పొత్తు కోసం ప్రయత్నించిన చిరంజీవిపై వారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసు నేతలను పంచలూడదీసి కొడతానన్న ప్రజారాజ్యం పార్టీతో పొత్తేమిటని వారు ప్రశ్నించారు. వైయస్ జగన్ ను కలిసిన తర్వాత వారు సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కాంగ్రెసు సీనియర్ నేతలను దూషించిన తీరును పార్టీ కార్యకర్తలు మరిచిపోలేదని అన్నారు. దీనిపై జగన్ స్పందించాలని వారు కోరారు. అవసరమైతే జగన్ సొంత పార్టీ పెట్టాలని వారు కోరారు.
జీవిత, రాజశేఖర్ లపై ప్రజారాజ్యం అనుబంధ మహిళా సంఘం మహిళా రాజ్యం అధ్యక్షురాలు శోభా రాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విమర్శలు అపకపోతే రాజశేఖర్, జీవితలను బట్టలూడదీసి కొడతామని వారు హెచ్చరించారు.