వామపక్షాలపై చంద్రబాబు గుర్రు

Chandrababu Naidu
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సీట్ల పంపకంపై తెలుగుదేశం, వామపక్షాల మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఈ మూడు పార్టీలు అవగాహనకు వచ్చాయి. అయితే సీట్ల పంపకంలో మాత్రం అవగాహన కుదరడం లేదు. సిపిఎం 56 డివిజన్లు అడుగుతుండగా, సిపిఐ 40 డివిజన్లు అడుగుతోంది. ఈ రెండు పార్టీలు కూడా తాము అడుగుతున్న సీట్ల జాబితాను తెలుగుదేశం పార్టీకి సమర్పించాయి. మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీకి దిగేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై చర్చకు పోలిట్ బ్యూరో సమావేశం జరుగుతుంది. వామపక్షాల తీరుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

చర్చలు కొలిక్కి రాకముందే సిపిఎం అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. చర్చలు కొలిక్కి రాకముందే సిపిఎం జాబితాను విడుదల చేయాలనుకోవడం చర్చనీయాంశంగా మారింది. శాసనసభ ఎన్నికల్లో తమకు ఎదురైన అవమానాన్ని దృష్టిలో పెట్టుకుని సిపిఎం ఈ చర్యకు దిగుతున్నట్లు తెలుస్తోంది. అయితే మిత్రపక్షాలకు ఎక్కువ సీట్లు కేటాయించడం వల్లనే శాసనసభ ఎన్నికల్లో నష్టం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.

కాగా, కాంగ్రెసు తన అభ్యర్థుల జాబితాను ఈ నెల 5వ తేదీన విడుదల చేయనుంది. ఇందుకు గాను కాంగ్రెసు రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ బుధవారం సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారు. ప్రజారాజ్యంతో పొత్తు లేనట్లేనని తేలిపోయింది. దీంతో కాంగ్రెసు పార్టీ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+