అంబానీల కేసు నుంచి తప్పుకున్న జడ్జి

గత ఏడాది కాలంగా ముఖేష్ అంబానీ గ్రూపు ప్రాజెక్టులకు సలహాలు ఇస్తున్న బెంగుళూర్ లోని ఎజడ్బీ పార్ట్నర్స్ లో తన కూతురు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. రవీంద్రన్ తప్పుకోవడంతో అంబానీ సోదరుల గ్యాస్ వివాదం కేసు విచారణకు ప్రధాన న్యాయమూర్తి మరో బెంచ్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కేసు విచారణను గురువారానికి వాయిదా వేశారు. ప్రస్తుత బెంచ్ లో రవీంద్రన్ తో పాటు ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణన్, జస్టిస్ పి. శాతసివన్ ఉన్నారు.












Click it and Unblock the Notifications