తెలంగాణ రాష్ట్రమే లక్ష్యం, కెసీఅర్

కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌తో సమావేశం కానున్నారు. 2004లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం తెలంగాణ ఏర్పాటుపై ఇచ్చిన హామీని.. ఆయన ఈ సందర్భంగా ఆమె దృష్టికి తీసుకెళ్లనున్నారు. తెలంగాణ ఏర్పాటుకు సాగించనున్న ఉద్యమం, చేపట్టదలచిన ఆమరణ నిరాహార దీక్ష గురించి ప్రతిభకు తెలపనున్నారు. సోమవారం ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రతిపక్ష నేత ఎల్.కె.అద్వానీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర మంత్రి శరద్‌పవార్, యూపీ ముఖ్యమంత్రి మాయావతితో కేసీఆర్ సమావేశమవుతారు.












Click it and Unblock the Notifications