డాలర్ శేషాద్రికి హైకోర్టు షాక్

శేషాద్రిపై క్రిమినల్ కేసు ఎందుకు పెట్టరాదని, ఆయనకు నార్కో ఎనాలిసిస్ పరీక్షలు ఎందుకు నిర్వహించరాదని హైకోర్టు ప్రశ్నించింది. తమ ప్రశ్నలకు రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని హైకోర్టు టిటిడిని ఆదేశించింది. ఆయన బాధ్యతలు నిర్వహించిన సమయంలో 300 డాలర్లు మాయమైన విషయంపై ఆయనపై కేసు నమోదైంది. 2006 జూన్ లో పదవీ విరమణ చేసిన శేషాద్రిని టిటిడి ఒఎస్డీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మళ్లీ ఇప్పుడు ఆయన పదవీ కాలాన్ని పొడగించింది. ఓఎస్డీ పదవికి శేషాద్రి మినహా మరొకరు అర్హులు కారా అని హైకోర్టు ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications