జగన్, 'గాలి' గనుల లింక్

YS Jagan
హైదరాబాద్: కర్నాటకలో బిజెపి ప్రభుత్వానికి దడ పుట్టించిన మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసు పార్టీ అధిష్టానానికే సవాల్ విసురుతున్న వైయస్ జగన్ కు మధ్య గల సంబంధాన్ని ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక బయటపెట్టింది. ఈ మేరకు ఆ పత్రిక ఓబుళాపురం గనుల వ్యవహారంపై ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ వార్తాకథనం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సాక్షి దినపత్రికలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న జర్నలిస్టు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఆయన సోదరుడు సజ్లల దివాకర్ రెడ్డికి సంబంధించిన కంపెనీలపై కూడా ఆ పత్రిక రాసింది. గాలి జనార్దన్ రెడ్డికి, బెంగుళూర్ లో కూడా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న వైయస్ జగన్ కు ఉన్న సాన్నిహిత్య సంబంధం అందరికీ తెలిసిందే. కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్పతో సంధికి జగన్ కు చెందిన సాక్షి దినపత్రికకు సంబంధించిన డిమాండ్ ను గాలి జనార్జన్ రెడ్డి చేర్చిన విషయం కూడా తెలిసిందే.

కాగా, తాజాగా తెలుగు దినపత్రిక బయటపెట్టిన విషయం గనుల వ్యవహారానికి సంబంధించింది. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన 800కోట్ల రూపాయల విలువ చేసే ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ లో రెడ్ గోల్డ్ ఎంటర్ ప్రైజెస్ అనే కన్సల్టెన్సీకి 400 కోట్ల రూపాయల భాగస్వామ్యం ఇచ్చినట్లు ఆ పత్రిక రాసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవసరమైన అనుమతులు, లైసెన్సులు పొందడానికి డాక్యుమెంట్లు తయారు చేయడంలో తోడ్పడినందుకు, గనుల తవ్వకానికి సాంకేతిక సహకారం అందిస్తున్నందుకు ఈ భాగస్వామ్యాన్ని ధారపోస్తున్నట్లు రాసింది.

ఆ దినపత్రిక వార్తాకథనం ప్రకారం - ఓబుళాపురం మైనింగ్ కంపెనీలో సగం వాటా పొందుతున్న రెడ్ గోల్డ్ సంస్థ భాగస్వామి రామసుబ్బారెడ్డి. ఈయన పులివెందులకు చెందినవాడు. ఈయన సజ్జల ఐరన్ అండ్ స్టీల్ సంస్థ సిఇవో కూడా. సజ్లల కంపెనీ చైర్మన్, ఆర్ ఆర్ గోల్డ్ యజమాని సజ్జల దివాకర్ రెడ్డి. ఆర్ఆర్ గ్లోబల్, సజ్జల గ్రూప్ కంపెనీస్, రెడ్ గోల్డ్ ఒకే నెట్ వర్కు కిందికి వస్తాయి. వీటి అనుసంధాన కర్త ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువనేత. దివాకర్ రెడ్డి సోదరుడు రామకృష్ణా రెడ్ిడ వైయస్ జగన్ కు చెందిన సాక్షి గ్రూప్ డైరెక్టర్ గా కీలక స్థానంలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+