ముంబై: మహారాష్ట్ర శాసనసభను మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) శాసనభ్యులు సోమవారం స్తంభింపజేశారు. సమాజ్ వాదీ సభ్యుడు అబూ ఆసిం అజ్మీ హిందీలో ప్రమాణ స్వీకారం చేయడాన్ని నిరసిస్తూ ఎంఎన్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆజ్మీ హిందీలో ప్రమాణం చేయడం మొదలు పెట్టగానే ఎంఎన్ఎస్ సభ్యులు ఆయన వైపు దూసుకెళ్లి ఆయనను తోసేశారు. పోడియంపై మైక్ ను శాసనసభ్యుడు రమేష్ బంజ్లే పీకి పారేశాడు.
ఆజ్మీ ఆత్మరక్షణ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఎంఎన్ఎస్ సభ్యుడు రామ కదం అజ్మీ చెంపపై కొట్టాడు. ఛాతీపై కూడా కొట్టాడు. ఎంఎన్ఎస్ సభ్యుల చర్యతో శాసనసభ దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే సభను వాయిదా వేశారు.