టిడిపి ఎమ్మెల్యేల ధర్నా, అరెస్టు

కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్, కెవిపి రామచందర్ రావు ఒత్తిళ్లకు తలొగ్గి రోశయ్య త్రిసభ్య కమిటీ విచారణను తూతూ మంత్రంగా సాగిస్తున్నారని తెలుగుదేశం శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా విమర్శించారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి ఓబుళాపురం గనులకు సంబంధించిన రికార్డులను చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కొడాపై 75 బృందాలతో విచారణ జరిపిస్తున్న కేంద్రం లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిన ఓబుళాపురం గనుల కంపెనీ వ్యవహారాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications