చంద్రబాబుకు పిచ్చి పట్టింది: గాలి

వైయస్ జగన్ తెల్ల కాగితం లాంటివాడని, జగన్ పై ఆరోపణలు చేసే హక్కు చంద్రబాబుకు లేదని, లక్ష మధుకోడాలతో సమానమైన చంద్రబాబుకు జగన్ ను విమర్శించే స్థాయి లేదని ఆయన అన్నారు. తనదీ, స్వర్గీయ వైయస్సార్ ది కొడుకూతండ్రుల వంటి సంబంధమని, వైయస్సార్ మంచి మనసుతో ఉక్కు కర్మాగారం స్థాపనకు అనుతిచ్చారని, ఆ మహా వ్యక్తికి సంతాపం ప్రకటించే వీలు కూడా లేకుండా చంద్రబాబు తనపై, జగన్ పై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు లాంటి నీచ నికృష్టమైన నేత ప్రపంచంలోనే లేడని ఆయన అన్నారు. ప్రజలు చంద్రబాబును నమ్మబోరని, అందుకే రెండోసారి కూడా ఓడించారని ఆయన అన్నారు. అవసరమైతే తాను ఆంధ్రప్రదేశ్ లో ఉండి మరోసారి చంద్రబాబును ఓడిస్తానని ఆయన అన్నారు. చంద్రబాబు నీచుడు, నికృష్టుడని, ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచారని, తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి ఖడ్గ మృగం లాంటివాడని ఆనయ వ్యాఖ్యానించారు.
వైయస్సార్ లేకపోవడం వల్ల తమకు దిక్కు లేదని చంద్రబాబు అనుకుంటున్నారని, తమకు దేవుడి ఆశీస్సులున్నాయని ఆయన అన్నారు. ఓబుళాపురం గనులను కర్నాటక, ఆంధ్రప్రదేశ్ మీడియాకే కాకుండా జాతీయ, అంతర్జాతీయ మీడియాకు కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. చంద్రబాబువి తప్పుడు కూతులని ఆయన వ్యాఖ్యానించారు. తనపై చంద్రబాబు దుష్ర్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజాసమస్యలను విస్మరించి చంద్రబాబు తమ కంపెనీపై పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications