న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చుక్కలనంటాయి. మంగళవారం నాడు బులియన్ మార్కెట్లో బంగారం ధర 200 రూపాయలు పెరిగి 17, 300 రూపాయల గరిష్ట ధరను నమోదు చేసుకుని ఆల్‌టైం రికార్డును సృష్టించింది. క్రితం ముగింపుకు వెండి కిలోకు 400 రూపాయల వృద్ధితో 34 వేల రూపాయల ధరను పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ క్షీణత, పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారానికి డిమాండ్ పెరిగిందని వ్యాపార నిపుణులు తెలిపారు.